ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర సీ్త్రలను గౌరవించడం నేర్చుకోవాలి. – పవిత్ర,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి
●


