పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించుకున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్ ఆషా, పీడీఎస్‌ఓ,
జిల్లా కార్యదర్శి, తిరుపతి
●


