ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
– లక్ష్మమ్మ,
శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి


