ఏపీఎస్పీడీసీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు రావాలి | - | Sakshi
Sakshi News home page

ఏపీఎస్పీడీసీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు రావాలి

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

తిరుపతి రూరల్‌:జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యు త్‌ పంపిణీ సంస్థగా ఏపీఎస్పీడీసీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాత్మక కార్యచరణను అమలు చేస్తున్నట్టు సీఎండీ శివశంకర్‌ తెలిపారు. సోమవారం ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేశంలోని ప్రముఖ ఇంధన సామర్థ్య నిపుణులు, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ మాజీ డైరెక్టర్‌ అజయ్‌ మాథూర్‌తో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీఎండీ శివశంకర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు మెరుగైన సేవలను అందించాలన్న సంకల్పంతో ఏపీఎస్పీడీసీఎ ల్‌ పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పీఎం కుసుమ్‌ 2.0 పథకం కింద ఫీడర్‌ స్థాయిలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల అమలుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

మోడల్‌ గ్రీన్‌ నియోజకవర్గంగా కుప్పం

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని ‘‘మోడల్‌ గ్రీన్‌ నియోజకవర్గం’’గా మార్చుతున్నామని సీఎండీ తెలిపారు. పీఎం ఎస్‌జీఎంబీవై యూఎల్‌ఏ (సీఏపీఈఎక్స్‌) మోడల్‌ కింద ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరేలా 2025–26 మధ్యలో 4.36 మెగావాట్ల సౌర విద్యుత్‌ తయారీకి వ్యవస్థలు ఏర్పాటు చేశామన్నారు.

162 ప్రదేశాల్లో పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పీఎం ఈ డ్రైవ్‌ కార్యక్రమం కింద 13 కిలోవాట్‌ సామర్థ్యంతో లైట్‌ ఈవీ, ఏసీ/డీసీ చార్జింగ్‌ స్టేషన్లతో 162 ప్రదేశాల్లో పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఏపీఎస్పీడీసీఎల్‌కు సంపూర్ణ సహకారం

సమర్థవంతమైన ఏపీఎస్పీడీసీఎల్‌ డిస్కమ్‌కు తన సంపూర్ణ సహకారం అందిస్తానని వర్చువల్‌గా సమావేశమైన బీఈఈ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అజయ్‌ మాథూర్‌ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సంస్థ డైరెక్టర్లు అయూబ్‌ ఖాన్‌, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement