ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్‌ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి

గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి. – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్‌

పరిస్థితుల్లో మార్పు రాలేదు

మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి.

– డాక్టర్‌ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement