దొరవారిసత్రం: మండలంంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మేలనాలత్తూరు గ్రామానికి చెందిన ఎన్ హైమావతి(57) తన కుమారితో బైక్‌పై సూళ్లూరుపేటకు వెళుతుండగా గ్రామానికి సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆటోలో డీవీ సత్రం పీహెచ్‌సీకి తరలించేలోపు మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఈప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అలాగే తల్లంపాడు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్లే భారీ కంటైనర్ అనుమతి కోసం ప్లాజా వద్ద ఆపి కాగితాలను తీసుకుని డ్రైవర్ ఆఫీస్‌లోకి వెళ్లాడు. ఇంతలో కంటైనర్ లారీలోని హెల్ఫర్ ఇంద్రజిత్(38) ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కంటైనర్ లారీ కిందకు వెళ్లి టైర్లను తనిఖీ చేస్తున్నాడు. విషయం తెలియని కంటైనర్ లారీ డ్రైవర్ బయలుదేరాడు. టైర్లు కింద ఉన్న హెల్పర్ నలిగిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


