21న మత్స్య జయంతి | - | Sakshi
Sakshi News home page

21న మత్స్య జయంతి

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీన మత్స్య జయంతి వేడుక జరుగనుంది. ఈ మేరకు శనివారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది.

24 నుంచి తెప్పోత్సవాలు

వేదనారాయణస్వామివారి ఆలయంలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి, రెండో రోజు గోదాదేవి సమేత వేదనారాయణ స్వామి, మూడో రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి, నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి, ఐదో రోజు స్వామి తెప్పలపై విహరించనున్నారు.

బాలికపై మారుతండ్రి లైంగిక దాడి

చంద్రగిరి : మారు తండ్రి అయిన ఆ మృగాడి కామానికి బాలిక నరకం అనుభవించింది. లైంగిక దాడికి పాల్పడిందే కాక విషయం మీ అమ్మకు చెబితే ఇద్దరినీ చంపేస్తానంటూ బెదిరించిన ఘట న శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇ లా.. తిరుచానూరుకు చెందిన ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మొదటి భార్యను వదిలేయడంతో, మరో మహిళ ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే 11 ఏళ్ల కుమార్తె ఉంది. వారం రోజుల క్రితం మహిళ లేని సమయంలో అతను ఆమె కు మార్తైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడు రో జుల పాటు రాత్రి సమయాల్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి నరకయాతన అ నుభవించింది. ‘ఈ విషయాన్ని మీ తల్లికి చెబితే నీతోపాటు మీ అమ్మను కూడా చంపేస్తా’’ అని మృగాడు బాలికను బెదిరించాడు. అతను బయ టకు వెళ్లడంతో తన తల్లికి బాలిక జరిగిన ఉదంతాన్ని వివరించింది. శనివారం తల్లి బాలికతో పాటు వచ్చి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, చికిత్స నిమిత్తం బాలికను రుయా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు.

బొలెరో ఢీకొని క్లీనర్‌ మృతి

చంద్రగిరి: బొలెరో వెనుక నుంచి ఢీకొని క్లీనర్‌ మృతి చెందిన ఘటన శనివారం భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి సమీపంలోని కాపుగున్నేరి గ్రామానికి చెందిన రూకేష్‌ (25), లారీ క్లీనర్‌గా పనిచేస్తు న్నాడు. శనివారం శ్రీకాళహస్తి నుంచి కొకొకోలా బాటిళ్లను లోడ్‌ వేసుకుని పీలేరుకు పయనమయ్యారు. అధిక లోడ్‌ కారణంగా లారీ కనుమ ఎ క్కలేకపోవడంతో ఆగిపోయింది. ఈ క్రమంలో రూకేష్‌ లారీ వెనుక చక్రాలకు రాళ్లు పెడుతుండగా వెనుక నుంచి వ స్తున్న బొలెరో వాహనం రూకేష్‌ను ఢీకొని, అతని పై నుంచి దూసుకెళ్లింది. అతడిని ఆస్పత్రికి త రలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement