● బంగారు ఆభరణాలు, నగదు అప్పగింత ● అభినందించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు | - | Sakshi
Sakshi News home page

● బంగారు ఆభరణాలు, నగదు అప్పగింత ● అభినందించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

● బంగారు ఆభరణాలు, నగదు అప్పగింత ● అభినందించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

నిజాయితీకి నిదర్శనం

తిరుపతి క్రైం : ఆ చిన్నారులు చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. దారిలో దొరికిన రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. వెంకటగిరి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులు గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఎస్‌బీఐ బ్యాంకు వద్ద బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, ఆరో తరగతి విద్యార్థిని పద్మజ, ఏడో తరగతి విద్యార్థిని హేమలతకు రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. ఆ పర్సును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో పాటు ఆధార్‌ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. దీంతో వారు వెంకటగిరి పోలీసులకు ఆ పర్స్‌ను అప్పగించారు. విద్యార్థినుల నిజాయితీ గురించి తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు వారిని ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement