శోత్రియ భూముల ఆక్రమణపై కొరడా | - | Sakshi
Sakshi News home page

శోత్రియ భూముల ఆక్రమణపై కొరడా

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

వరదయ్యపాళెం: మండలంలోని పాదిరికుప్పం రెవెన్యూలోని శోత్రియ భూముల ఆక్రమణపై మండల తహసీల్దార్‌ సుధీర్‌ రెడ్డి సిబ్బందితో కలసి కొరడా ఝుళిపించారు. వీకేఆర్‌వై కాలనీ సమీపంలో ఆక్రమణకు గురైన భూముల చుట్టూ కందకాలు (ట్రంచ్‌) తవ్వి, ఆక్రమణలను నిరోధించారు. ఇటీవల వీకేఆర్‌వైకాలనీ సమీపంలో కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే ఆక్రమణలకు పాల్పడి భూములు చదును చేశారు. దీనిపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆక్రమణలను నియంత్రించాలని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమిక ప్రాంతంలో కందకాలు తవ్వి ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నల్లయ్య, వీఆర్వో చలపతి, స్థానిక సర్పంచ్‌ శ్యామల సుబ్రమణ్యం, వెంకటేసులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement