సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

తిరుపతి అర్బన్‌: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలెక్టరేట్‌ ఉద్యోగులతో కలసి జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, ఎస్‌డీసీ రోజ్‌మాండ్‌, ఏఓ రామాంజుల నాయక్‌ పాల్గొన్నారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి ఉద్యోగులతో కలసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో మహిళలపై వివక్షలు ఉండేవని, కానీ ప్రస్తుతం మహిళలు ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ సృష్టికి మూలం సీ్త్ర అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement