పనిభారాన్ని తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

పనిభారాన్ని తగ్గించండి

Mar 7 2026 7:16 AM | Updated on Mar 7 2026 7:16 AM

● కలెక్టరేట్‌ వద్ద సర్వేయర్ల నిరసన

తిరుపతి అర్బన్‌: ఉద్యోగ పనిభారాన్ని తగ్గించాలంటూ సర్వేయర్లు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం సర్వేయర్లు అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తమ విభాగంతోపాటు పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపట్టారు. సమస్యలు పరిష్కారించాలంటూ సర్వేయర్ల రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు, కార్యదర్శి మహేషనాయుడు అధికారులను కోరితే.. వారిద్దరిని సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. వెంటనే వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సర్వే విభాగం జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ల సంఘం నేతలు లియకత్‌ అలీ, జ్యోతిగన్‌, విజయకుమార్‌, సాయికుమార్‌, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement