తిరుపతి మంగళం : రేణిగుంట రోడ్డులోని హైటెక్ మోటార్స్ నిస్సాన్ షోరూంలో గురువారం కొత్త నిస్సాన్ గ్రావైట్ కారును తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ్ రెడ్డి, డైరెక్టర్లు సి. నిరంజన్, సి.భారతి, సి.హోషిమరెడ్డి, సి.ఆశిష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నిస్సాన్ నుంచి విడుదలైన కొత్త గ్రావైట్ 7 సీటర్ కారు అధునాతన ఫీచర్లతో విడుదల చేసినట్లు తెలిపారు. భద్రతలోనూ నూతన ప్రయోగాలతో కూడిన స్టాండర్డ్ ఫ్యూచర్స్‌తో పాటు 6 ఇయర్ బ్యాగ్, ఫ్రంట్ ప్యాకింగ్ సెన్సర్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో వైపర్, ఫాలో హెడ్ల్యాండ్స్, 3రోస్ ఏసీ, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ డాష్ క్యామ్, ఎల్‌ఈడీ, ప్రొజెక్టర్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కారు ప్రారంభ ధర రూ.5.65 లక్షలు ఉంటుందని, ఈ కారు ఐదు రంగులతో పాటు ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.


