పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అన్ని 5,158 వరకు రాహుకేతు పూజలు నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా రూ.500, రూ.750 రాహుకేతు పూజలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. చిన్న లడ్డు, వడ, పులిహోర, జిలేబీ తదితరాలతో మొత్తం 25,592 ప్రసాదాలను భక్తులకు అందించినట్లు సమాచారం. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భక్తులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. – శ్రీకాళహస్తి


