గగన వైకుంఠం
కష్టతరంగా తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం స్థానికులకు చివరి మూడురోజుల మాత్రమే అవకాశం అదీ కేవలం 15వేల మందికి మాత్రమే పరిమితం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం తిరుపతి వాసులకు గగనంగా మారింది. టీటీడీ నిర్ణయాల కారణంగా మొత్తం పది రోజుల్లో చివరి మూడు రోజులు మాత్రమే స్ధానికులకు అవకాశం దక్కనుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా రిజిష్టేషన్ చేసుకున్న వారిలో లక్కీడిప్ ద్వారా రోజుకు 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి లభించనుంది. ఈ లెక్కన చివరి మూడు రోజుల్లో కేవలం 15 వేల మంది స్థానికులకు మాత్రమే దర్శన భాగ్యం ఉండనుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానికులకు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తూ తిరుపతిలోనే ప్రత్యేక కేంద్రాల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఆ మేరకు పది రోజుల పాటు రోజుకు 8 వేల మందికి చొప్పున 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి అనాలోచిత నిర్ణయాల కారణంగా తిరుపతి వాసులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గగనంగా మారడం గమనార్హం.


