చోరీకి విఫలయత్నం
పుత్తూరు : పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే వరుసగా మూడు దొంగతనాలు జరగ్గా 105 గ్రాముల బంగారు నగ లు, 400 గ్రాముల వెండి ఆభరణాలను దుండగు లు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము 2–30 గంటల ప్రాంతంలో స్థానిక నగరం రోడ్డులోని సూర్య ఎలక్ట్రికల్ దుకాణంలోకి ఓ దుండగు ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. రాడ్ ను ఉపయోగించి రెండు తాళాలు విరగొట్టిన దొంగ మూడవ తాళం తొలగించలేకపోయాడు. దీంతో వెనుదిరిగాడు. ఉదయం షాపు వద్ద జరిగిన దొంగతనం ప్రయత్నాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ చిత్రాల ఫుటేజీని అందజేశాడు. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


