హైవోల్టేజీతో కుటీర పరిశ్రమ దగ్ధం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కల్లివెట్టు గ్రామంలో హైవోల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో మోటార్లు వైడింగ్‌కు సంబంధించిన కుటీర పరిశ్ర మ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కల్లివెట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసులు విమల ఎలిక్ట్రికల్ మోటార్లు రిపేర్, వైడింగ్ పేరుతో ఇంటి వద్దనే కుటీర పరిశ్రమను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమలు, వ్యవసాయ, గృహ అవసర మోటార్లకు మరమ్మతుల కోసం వైడింగ్ చేసేందుకు ఇంటి వద్దనున్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసి నడిపిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు హైవోల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో ట్రాన్‌ఫార్మర్ కాలిపోవడంతోపాటు కుటీర పరిశ్రమలో షార్టు సర్క్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగి, వైడింగ్ చేసిన భారీ మో టటార్లు, వైడింగ్‌కు వినియోగించే 150 కిలోల రాగివైరు, మోటార్లు అమర్చే కూలింగ్ ఫ్యాన్లు, ఇన్సులేషన్ వైర్లు కాలిపోయాయి. రూ.5 లక్షలు మేర నష్టం వాట్టిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదు కోవాలని బాధితుడు శ్రీనివాసులు తెలిపారు. అంతే కాకుండా గ్రామంలో ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్డ్‌లు, కాలి పోయాయని, విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కా రణంగానే నష్టపోయామని గ్రామస్తులు అన్నారు.
ఎస్టీవీడీ 152 కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్


