శ్రీశక్తి పీఠంలో సినీ హీరో సుమన్
క్లుప్తంగా
రామచంద్రాపురం: మండలంలోని రాయల చెరువు సమీపంలో ఉన్న శ్రీశక్తి పీఠాన్ని శుక్రవారం ప్రముఖ సినీ హీరో సుమన్ సందర్శించారు. పీఠానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శక్తిపీఠంలోని శ్రీమరకత శక్తి కాళీదేవి, శ్రీ శ్వేత వారా హిదేవికి ప్రత్యేక పూజలు చేయించి, శివలింగానికి ముడుపుకట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతులు శ్రీసిద్ధేశ్వరనంద భారతి మహాస్వామి, స్థానిక పీఠాధిపతి రమ్యానంద భారతి స్వామివారు ఆయన్ని ఆశీర్వదించి, అమ్మవారి శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం కార్యదర్శి శ్రీకాంత్, ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


