కొంకా చెన్నాయగుంట రెవెన్యూలో..
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయం
మఠం భూముల్లో ఆక్రమణలదారుల రచ్చ
బండి బాటను దర్జాగా కాజేస్తున్న అక్రమార్కులు
అడ్డు చెబుతున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ, మఠం భూములు, లే అవు ట్ ఓపెన్ ప్లాట్లు, కాలువలు, కుంటలు ఆక్రమణలు జరుగుతున్నాయి. పలు చోట్ల వ్యవసాయం కోసం ప్రభుత్వం ఇచ్చిన రైతువారీ పట్టాలను చూపి, అక్రమంగా కట్టడాలు కడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కళ్ల ముందు రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయమవుతున్నా మండల స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు సరికదా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళితే వెనుదిరిగి రావా లని ఆదేశిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన తహసీల్దార్‌లే తమ సిబ్బంది కాళ్లకు కళ్లెం వేస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని, కట్టడి చేయకుంటే ప్రమాదమని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు హెచ్చరించినా జిల్లా అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సీఎం ఆదేశాలు భేఖాతర్..
విజయవాడలో ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తిరుపతి చుట్టు పక్కల భూ కబ్జాలు అధికమవుతున్నాయని, వాటిని ఇప్పుడే కట్టడి చేయకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుందని కలెక్టర్లను హెచ్చరించినా.. జిల్లా అధికారులు చలించడం లేదన్న ఆరోపణలు కొందరు కూటమి నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి.
కాలువలో మట్టి తోలి పూడ్చి వేసిన ఆక్రమణదారులు
వేదాంతపురంలో గోడౌన్ నిర్మాణానికి అక్రమార్కులు కూల్చివేసిన షెడ్లు
తిరుపతిలో బరి తెగిస్తున్న
అక్రమార్కులు
తిరుపతి అర్బన్ మండలం కొంకా చెన్నాయగుంట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 222/5 లో 1.10 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని మూడు రోజులుగా కబ్జాదారులు కాజేస్తున్నారని స్థాని కులు చెబుతున్నారు. సుమారు రూ.25 కోట్ల విలువైన ఆ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. ఆ కాలువ భూములపై అధికార పార్టీకి చెందిన స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కన్నుపడిందని, ఆయన తన అనుచరుల ద్వారా ఆ భూములను కాజేస్తున్నారన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఆక్రమణలకు అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి రావడంతో వారు వెనుదిరిగివెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.
కొంకా చెన్నాయగుంట రెవెన్యూలో..
కొంకా చెన్నాయగుంట రెవెన్యూలో..
కొంకా చెన్నాయగుంట రెవెన్యూలో..


