వేడుకగా గొబ్బిదేవత పురఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవా రం వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం వేడుకగా జరిపారు. తొలుత ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతకు పలు అభిషేకాలు, విశేషాలంకరణ చేశారు. అనంతరం పుర ఉత్స వం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,255 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు త లనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికె ట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భ క్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూ లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారి ని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
కల్కి ట్రస్టు ఆక్రమిత భూములపై విచారణకు ఆదేశం
వరదయ్యపాళెం: కల్కిట్రస్టు పరిధిలో ఆక్రమిత అటవీ, ప్రభుత్వ డీకేటీ భూముల వివరాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం మండల తహసీల్దార్‌లకు ఉత్తర్వులు పంపారు. ఇటీవల కల్కి ట్రస్టు భూము ల ఆక్రమణపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకటసుబ్బయ్య, అటవీ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మేరకు అంజూరు అటవీ ప్రాంతంలో 21 ఎకరాలు, అలాగే వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణ గురించి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు కేంద్ర ప్రభుత్వ
స్టాండింగ్ కౌన్సిల్‌గా పెల్లేటి
కోట: రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పె ల్లేటి రాజేష్‌కుమార్ ను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజా గా ఉత్తర్వులు జారీ చే సింది. రాజేష్‌కుమార్ కోటకు చెందిన సీనియ ర్ న్యాయవాది పెల్లేటి గోపాల్‌రెడ్డి కుమారు డు. రాజేష్‌కుమార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సేవల ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించినట్లు ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి తెలిపారు.
వేడుకగా గొబ్బిదేవత పురఉత్సవం


