28న రామానుజన్ గణిత ప్రతిభా పరీక్ష
తిరుపతి సిటీ: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని విశ్వం సైనిక్ – నవోదయ పోటీ పరీక్షల కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ‘శ్రీ శ్రీనివాస రామానుజన్ మాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’ నిర్వహించనున్నట్లు అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈ గణిత ప్రతిభా పరీక్షకు సంబంధించిన సమాచార పత్రికను స్థానిక వరదరాజనగర్‌లోని విశ్వం స్కూల్‌లో సోమవారం అపుస్మా నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణిత ప్రతిభా పరీక్షను వరదరాజనగర్‌లోని విశ్వం టాలెంట్ స్కూల్‌లోనూ. జీవకోనలోని విశ్వం హైస్కూల్‌లోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తరగతి వారీగా ప్రథమ బహుమతి రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతయ బహుమతి రూ.5 వేలుతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 8688888802, 9177726256 నంబర్లకు వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపుస్మా నాయకులు రవీంద్రారెడ్డి, రఘునారాయణరావు, బాషా, టీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


