పరుగులు పెట్టిన తమిళ తమ్ముళ్లు
విజయపురం : మండలంలోని మహారాజపురం కొండపై అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న తమిళ తమ్ముళ్లు ప రుగులు తీశారు. ‘మహారాజపురంలో అనకొండలు’ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి తమిళ తమ్ముళ్లు కొండపై తమకు సంబంధించిన టిప్పర్లు కనిపించకుండా సరిహద్దు దాటించినట్లు స్థానిక ప్రజలు చెప్పారు. జిల్లా అధికారులు వస్తే అక్రమ గ్రావెల్ వ్యాపారం బయటపడుతుందని తెలుసుకున్న అక్రమ వ్యాపారులు తమిళనాడు నుంచి టిప్పర్లు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు సోమవారం జిల్లా అధికారులు రావడంతో వాహనాలను దాచిపెట్టినట్లు తెలిసింది.
సైబర్ మోసం..
రూ. 92 లక్షలు మాయం
తిరుపతి క్రైం: నగరంలోని కెనడీ నగర్‌లో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల మాయ మాటలు విని, రూ.92 లక్షల పోగొట్టు కున్న సంఘటన సోమవారం జరిగింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిరుపతి కెనడీనగర్‌లో నివాసముంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే మంచి డబ్బులు వస్తాయని ఒక యాప్‌ను తెలిపా డు. ఆ వ్యక్తి మాటలు గుడ్డిగా నమ్మిన ప్రభుత్వ ఉద్యోగి ఆ యాప్ ద్వారా రూ.92 లక్షలు జమ చే శాడు. ఆ నగదును విత్‌డ్రా చేసుకోవాలని చూస్తే రాకపోవడంతో మోసపోయామని తెలుసుకుని ఈస్ట్ పోలీసులు సంప్రదించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


