లారీ, పాల వ్యాన్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

లారీ, పాల వ్యాన్‌ ఢీ

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

లారీ,

లారీ, పాల వ్యాన్‌ ఢీ

తిరుపతిలో

– వ్యాన్‌ డ్రైవర్‌కు గాయాలు

పాకాల: లారీ, పాల వ్యాన్‌ ఎ దురెదురుగా ఢీ కొన్న ఘటనలో పాల వ్యాన్‌ డ్రైవర్‌కు గా యాలైన సంఘటన ఆదివా రం రాత్రి ఒంటి గంటకు చోటు చే సుకుంది. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మండలంలోని గుండ్లగుట్టపల్లి వద్ద పీలేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న లారీ, దామలచెరువు నుంచి కల్లూరు వైపు వెళుతున్న పాలవ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాలవ్యాను డ్రైవర్‌ కరుణాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన కరుణాకర్‌ని ఆస్పత్రికి తరలించారు.

గజలక్ష్మీ..నమోస్తుతే..!

చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీ అమ్మవారు సోమవారం రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాఢ సందర్భంగా ఆలయంలో ప్ర త్యేక పూజలను చేశారు. అమ్మవారికి అభిషేక సేవ చేసి, విశేషాలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీకృష్ణముఖ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్స వం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు తనకు ఎంతో ప్రీతికరమైన గజవాహనా న్ని అధిష్టించి నాలుగు మాడవీధుల్లో ఊరేగారు.

మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

తిరుపతి అర్బన్‌: సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ మోసాలపై అంతా అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో కలసి సైబర్‌ నేరాల నియత్రణ, అవగాహనకు చెందిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ సమన్వయంతో విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సైబర్‌ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలను గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి వసంత బాయి, నోడల్‌ అధికారి వాసంతి, వన్‌ స్టాప్‌ సెంటర్‌ అడ్మిన్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీలో కారుణ్య నియామకాలు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ పరిధిలో 11 మందికి కారుణ్య నియామకాలు చేపట్టారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. వీటితోపాటు రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. బాధ్యతయుతంగా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

పాలిటెక్నిక్‌ క్రీడా సంబరాలు

తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 28వ రీజనల్‌ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ సోమ వారం తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 16 పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి విచ్చేసిన సుమారు 500 మంది (బాలురు) క్రీడాకారులు తమ కళాశాల పతాకాలతో నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతిక విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నిర్మల్‌ కుమార్‌ ప్రియ ముఖ్య అతిథిగా విచ్చేసి, క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఒక అద్భుతమైన సాధనమన్నారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ప్రతినిధిగా సుబ్బారెడ్డి, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాథ రెడ్డి, సత్యవేడు, నగరి, కలికిరి, రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌, సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, ఎస్వీ పాలిటెక్నిక్‌ ఇన్‌చార్జి ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ పాల్గొన్నారు.

లారీ, పాల వ్యాన్‌ ఢీ 1
1/2

లారీ, పాల వ్యాన్‌ ఢీ

లారీ, పాల వ్యాన్‌ ఢీ 2
2/2

లారీ, పాల వ్యాన్‌ ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement