క్రీడలతో ఉపాధ్యాయులకు ఉత్సాహం
శ్రీకాళహస్తి: ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. సోమవారం జరిగిన క్రికెట్ ఫైనల్‌లో గూడూరు డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాళహస్తి డివిజన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దీనికి డీఈఓ కేవీఎన్. కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతగా నిలిచిన గూడూరు డివిజన్ జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన శ్రీకాళహస్తి డివిజన్ జట్టుకు బహుమతులు అందజేశారు. సమగ్ర శిక్ష సి. ఎం.ఓ సురేష్, ఐటీ సెల్ అధికారి ధనుంజయ నాయుడు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కిశోర్ పాల్గొన్నారు.


