సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ల అర్జీదారుల హోరు కొత్త పింఛన్లకు స్వస్తి చెప్పిన బాబు పెరుగుతున్న పింఛన్ల అర్హుల జాబితా పీజీఆర్‌ఎస్‌ను తనిఖీ చేసిన రెవెన్యూ మంత్రి ఆయనకూ పింఛన్ కోసం వినతులు
●
కలెక్టర్ కాళ్లు మొక్కుతున్న దివ్యాంగుని సహయకురాలు
తిరుపతి అర్బన్: పలువురు దివ్యాంగులు కలెక్టర్ పాదాలపై పడుతూ నీకాళ్లు మొక్కుతా సామీ.. మాకు పింఛన్ ఇప్పించండని అని కలెక్టర్ వేంకటేశ్వర్‌ను వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌కు)లో పింఛన్ల కోసం దివ్యాంగులు, మానసిక రోగులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో అర్జీలను అందజేశారు. ఆయన పింఛన్ కోసం వచ్చిన అన్నీ అర్జీలను పరిశీలిస్తామని, అర్హులకు న్యాయం చేస్తామని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే పీజీఆర్‌ఎస్‌కు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విచ్చేశారు. అర్జీల స్వీకరణ, అన్‌లైన్ తదితర అంశాలను పరిశీలించారు. ఆ సమయంలోనూ ‘సారూ మాకు పింఛన్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయి..అయినా పింఛన్లకు అనుమతులు ఇవ్వడం లేదు.’అని పలువురు దివ్యాంగులు మంత్రి ఎదుట వాపోయారు. తప్పకుండా అందరకీ న్యాయం చేస్తామంటూ ఆయన వెళ్లిపోయారు. డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్ అర్జీలను స్వీకరించారు.
అర్జీలు రాయించుకోవడానికి 2 గంటలు
పీజీఆర్‌ఎస్‌కు వచ్చేవారికి అర్జీలు రాసి ఇవ్వడానికి ఏడుగురు సచివాలయ ఉద్యోగులను కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేశారు. అర్జీదారుల సంఖ్య పెరిగిపోవడంతో అర్జీలు రాసుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. అలాగే దివ్యాంగుల అర్జీలను రాసి ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులను నియమించారు. వారి అర్జీలు రాసి ఇవ్వడానికి గంట సమయం పట్టింది.
అర్జీలు 412– హాజరైనవారు 1200 మంది
పీజీఆర్‌ఎస్‌కు 412 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పీజీఆర్‌ఎస్‌కు 1200 మందికి పైగానే హాజరయ్యారు. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తు లకు సహాయంగా వారి తల్లిదండ్రులు తరలివచ్చా రు. ఒక అర్జీ ఇచ్చినా కొన్ని గ్రామాలకు చెందిన వారు 30 నుంచి 40 మంది విచ్చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటుచూసినా అర్జీదారులతో నిండిపోయింది. 57 మంది పింఛన్ల కోసం అర్జీలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
మా భూముల్లో దౌర్జన్యం చేస్తున్నారు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను లాక్కుంటున్నారని ఆర్‌సీ పురం మండలంలోని దిగువ రామాపురం గ్రామానికి చెందిన పలువురు పేదలు వాపోయారు. పట్టాలతోపాటు అన్‌లైన్, డాక్యుమెంట్లు అన్ని తమ పేర్లతో ఉన్నప్పటికీ స్థానికంగా కొందరు అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా తమ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. స్థానిక రెవెన్యూ అధికారులు సైతం వాళ్లకే అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను ప్రాధేయపడ్డారు.
పింఛన్ ఇప్పిస్తేనే బతకగలుగుతాం..
బాబు పాలనలో పింఛన్ల పరిస్థితి ఇలా..
చంద్రబాబు 18 నెలల పాలనలో కొత్తగా 474 మందికి పింఛన్లు స్పౌజ్ పేరుతో ఇచ్చారు. అయితే 13,979మందికి పింఛన్లు తగ్గించారు. అలాగే 7,540 మంది దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు నోటీసులు ఇచ్చి వైకల్యం తగ్గించి, పింఛన్ తొలగిస్తున్నట్లు చెప్పారు. దీనికితోడు కొత్త పింఛన్లకు అనుమతి ఇవ్వకపోవడంతో నెలకు సుమారు 2 వేల మంది అర్హులై న దివ్యాంగులు పింఛన్ల కోసం అవస్థ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 35 వేల మందికిపైగా దివ్యాంగులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అర్హత ఉన్నవారికి పింఛన్లు ఇవ్వకపోగా తగ్గించే ప్రయత్నాలు సాగిస్తోంది.
అడుగు పడదు అవస్థ తీరదు
దివ్యాంగులు నడవలేని స్థితి.. అందరితో సమానంగా పనులు చేసుకోలేని దీనావస్థలో బతుకుతున్నారు. ఏ పనులూ చేసుకోలేక తమ వైకల్యాన్ని తలుచుకుంటూ మానసికంగా కుంగిపోతున్నారు. సమాజం దీనంగా చూస్తుంటే విలవిలాడి పోతున్నారు. తమ జీవనార్థం పింఛన్లు, తాము తిరగడానికి వీల్ చైర్లు మంజూరు చేయాలని ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ వచ్చి విన్నవిస్తున్నారు. అయినా వారి అడుగుకు ముందుకు పడడంలేదు. వారి అవస్థలు తీరడం లేదు. ఫలితంగా దివ్యాంగులతోపాటు వారికి సాయంగా వచ్చే సహయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
నా కుమారుడుకు పింఛన్ ఇవ్వండి
నా కుమారుడు వికిలేశ్వర్ మానసిక రోగి. నా బిడ్డ వైద్యం ఖర్చులు పెరిగిపోతున్నాయి. పేద కుటుంబానికి చెందిన మేము అంత ఖర్చు భరించలేకున్నాం. మాకు సాయం చేయండి. స్థానికంగా ఉంటున్న అధికారులకు మొరపెట్టుకున్నాం. కొత్త పింఛన్లకు అనుమతి రాలేదని చెబుతున్నారు. నాకు న్యాయం చేయండి సారూ.. ఈ మేరకు అనిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
– వికిలేశ్వర్‌తో ఉన్న తల్లి అనిత, రేణిగుంట
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే
సహజత్వం కోల్పోయిన జీవితాలు.. అర్ధాకలి బతుకులు.. దారి లే


