చట్టాలపై సరైన అవగాహన అవసరం
చంద్రగిరి: రాజ్యాంగంలోని చట్టాలపై సరైన అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ఐజీ రవిప్రకాష్ అన్నారు. మండలంలోని కల్యాణీ డ్యాం సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో నూతనంగా ఎంపికై న సివిల్ కానిస్టేబుళ్లకు సోమవారం శిక్షణ తరగతులను ప్రిన్సిపల్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐజీ రవి ప్రకాష్ హాజరై, ఫైరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత పీటీసీలో శిక్షణార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కళాశాలలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 9 నెలల కాలం పాటు పీటీసీలో శిక్షణ పొందడం జరుగుతుందన్నారు.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు విమల్
బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విమల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ లెవెన్ అండర్–14 వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. అందులో ఉత్తమ ప్రతిభ కనబరచిన విమల్ హిమచల్ ప్రదేశ్‌లో జనవరి 5న నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విమల్‌ను సోమవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తానయ్య, హరిబాబు అభినందించారు.
చట్టాలపై సరైన అవగాహన అవసరం


