సమాజ సేవే కర్తవ్యంగా భావించాలి
వెంకటగిరి రూరల్: సమాజ సేవే పోలీసుల కర్తవ్యంగా భావించి, విధి నిర్వహణలో రాణించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌లో నూతనంగా ఎంపికై 233 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ మెలగాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతాయని తెలిపారు. అనంతరం ట్రైనీ కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్న బ్యారెక్స్ ఏరియాను ఎస్పీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విజయానంద్, అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్‌కన్నా, అసిస్టెంట్ కమాండెంట్ రామకృష్ణ, ఆర్‌ఐ లక్ష్మయ్య, సుబ్బరావు, సత్యనారాయణ, వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్‌ఐ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


