‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం! | - | Sakshi
Sakshi News home page

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

Dec 15 2025 10:24 AM | Updated on Dec 15 2025 10:24 AM

‘కంట్

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

● సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌ పేరుతో మాయాజాలం ● పంపిణీ చేసిన కొద్ది రోజులకే చిరిగిపోయిన బ్యాగులు.. బూట్లు ● దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న పిల్లలు – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం
ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం సాయంత్రం స్పోర్ట్స్‌ మీట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు.
జిల్లాలో సర్వేపల్లి రాధాక్రిష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సమాచారం
ప్రభుత్వ పాఠశాలలు 2,939
సరఫరా చేసిన కిట్‌లు 2,42,017
విద్యార్థులకు అందించిన బూట్లు 2,01,154
తర్వాత చిరిగిన బ్యాగులు 1.90లక్షలు

పేద విద్యార్థులకు టోపీ పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం

సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

జిల్లా సమాచారం

మొత్తం ప్రభుత్వ పాఠశాలలు : 2,939

విద్యార్థులు : 3,02,172

సరఫరా చేసిన కిట్‌లు : 2,42,017

పంపిణీ చేసిన బ్యాగులు : 2,32,001

బూట్లు : 2,01,154

సరఫరాలోనే పాడైన బ్యాగులు, షూలు : 12వేలు

తర్వాత చిరిగిన బ్యాగులు : 1.90లక్షలు

బ్యాగుల దుస్థితిపై అందిన ఫిర్యాదులు : 73వేలు

బూట్లపై అందినవి : 62వేలు

సొంత బ్యాగులతో స్కూలుకు వెళుతున్న వారు : 1.62లక్షలు

బూట్లు లేకుండా వెళుతున్న వారు : 57వేలు

పథకం పేరు మారిస్తే ప్రయోజనం ఉండదు.. అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి.. అవినీతికి దూరంగా ఉండాలి.. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉండాలి.. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో కరువైంది. చివరకు సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలను సైతం ఇబ్బందిపెడుతోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరుతో ప్రారంభించిన విద్యార్థి మిత్ర కిట్లలో సైతం చేతివాటం ప్రదర్శించింది. నిరుపేద విద్యార్థులనే కనికరం కూడా లేకుండా నాసిరకం సామగ్రిని పంపిణీ చేసింది. ఆర్భాటంగా అందించిన అనతికాలంలోనే బ్యాగులు.. బూట్లు చిరుగులు పడడంతో బడుగు బిడ్డలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. బక్కచిక్కిన తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది.

చిరిగిన బ్యాగుతో పాఠశాలకు వెళుతున్న విద్యార్థి

షూలపై జిల్లా అధికారులకు అందిన ఫిర్యాదులు

62వేలు

సొంత బ్యాగులతో

స్కూలుకు వెళుతున్న వారు

సుమారు1.62లక్షలు

బూట్లు లేకుండా వెళుతున్న వారు 57వేలు

తిరుపతి సిటీ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక పేరిట సర్కారు బడుల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యాసామగ్రి పంపిణీ చేశారు. అదే పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరుతో విద్యా సామగ్రి కిట్‌లను అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూన్‌లో సదరు కిట్లను విద్యాశాఖ ఆర్భాటంగా పిల్లలకు అందజేసింది. అత్యున్నత విలువలు, నాణ్యమైన కిట్లను అందజేశామని సాక్షాత్తు విద్యాశాఖా మంత్రి లోకేష్‌ అసెంబ్లీ సాక్షిగా గొప్పగా ప్రకటించారు. అయితే అందులో నిజం మాత్రం నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారింది. కిట్‌లు పంపిణీ చేసిన కొద్ది రోజులకే పాడైపోయాయి. అసలే జిల్లాలోని 2,939 ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేశారు. 3 లక్షల మంది విద్యార్థులకు గాను, కేవలం 2.42 లక్షల మందికి అందజేశారు. అందులో 80 శాతం బ్యాగులు, షూలు నెల గడవక ముందే పూర్తిగా చిరుగులు పడ్డాయి. దీనిపై సుమారు 73 వేల మంది తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఇప్పటివరకు కొత్తవి అందజేయలేదని వాపోతున్నారు.

పేరు మార్చి..నాటకం

జగనన్న విద్యా కానుక పథకాన్ని పేరు మార్చి నానా హంగామా చేసి, చంద్రబాబు సర్కార్‌ పేద విద్యార్థులను మభ్యపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నాణ్యతకు ప్రాధానమిస్తూ బ్యాగులు, షూలతో పాటు పుస్తకాలను సైతం వందశాతం విద్యార్థులకు పంపిణీ చేసింది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ఇచ్చిందే అరకొర అనుకుంటే.. అందులోనూ నాసిరకం సామగ్రిని అందించి పేద బిడ్డలను దగా చేసింది.

సర్కారు వంచించింది

చంద్రబాబు సర్కార్‌ పేద విద్యార్థులను వంచించింది. విద్యామిత్ర కిట్ల పేరుతో నాసిరకం బ్యాగులు, షూలను అందజేసి మోసిం చేసింది. విద్యార్థులకు అందిన కిట్లు కనీసం 20 రోజులు కూడా వాడకంలో లేవు. పాడైపోయిన బ్యాగులు, షూలను విద్యార్థులు ఇప్పటికే మూలన పడేశారు. ఇలా పేద విద్యార్థులను మోసం చేయడం దుర్మార్గం. జగనన్న ప్రభుత్వంలో నాణ్యమైన కిట్లు అందించారు.

– ఓబుల్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ

విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

గతంలో నాణ్యమైన కిట్లు

మా అమ్మాయి శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. మరో పాఠశాలలో మా అబ్బాయి ఏడో తరగతి చదువున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. బ్యాగులు, బూట్లు నాలుగేళ్లపాటు చెక్కు చెదరలేదు. ప్రస్తుతం అందించిన కిట్లు నాసిరకంగా ఉండటంతో మూడునాళ్లకే దెబ్బతిన్నాయి. – ప్రమీలమ్మ, విద్యార్థిని తల్లి, శ్రీకాళహస్తి

అతీగతీ లేదు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చిన బ్యాగుల పూర్తిగా చిరిగిపోయాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మూడు నెలలుగా మా అమ్మాయి పాఠశాలకు మేం కొనిచ్చిన బ్యాగుతో వెళుతోంది. బూట్లు సైతం పాడైపోవడంతో పలుసార్లు కుట్టించాం. అయినా సరే కనీసం రెండు నెలలు కూడా రాలేదు. ఈ విషయంపై పాఠశాలల్లో ఫిర్యాదు చేశాం. కొత్తవి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. – సహీనా బాను, విద్యార్థిని తల్లి, తిరుపతి రూరల్‌

బ్యాగు కొనాల్సి వచ్చింది

మా అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ ఏడాది జూన్‌ 17వ తేదీన అమ్మాయికి విద్యార్థిమిత్ర కిట్‌ అందించారు. అందులో బ్యాగు అందించిన 20 రోజులు కూడా గడవక ముందే కుట్లు ఊడిపోయాయి. పలు సార్లు కుట్లు వేసినా లాభం లేకుండా పోయింది. దీంతో కొత్త బ్యాగు కొనాల్సి వచ్చింది.

– లక్ష్మీనారాయణరెడ్డి, విద్యార్థిని తండ్రి, తిరుపతి

చెప్పులతో వెళుతున్నాడు

మా అబ్బాయి తిరుపతిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం జూన్‌లో విద్యార్థిమిత్ర కిట్‌ పేరుతో స్కూల్‌ బ్యాగు, బూట్లు ఇచ్చారు. కానీ పది రోజులు గడవక ముందే బూట్లు పూర్తిగా చిరిగిపోయాయి. పలుసార్లు కుట్లు వేసినా నిలవలేదు. దీంతో చెప్పులు వేసుకుని బడికి వెళుతున్నాడు. పాఠశాలల్లో ఫిర్యాదు చేశాం. త్వరలో కొత్త షూ వస్తాయన్నారు. ఇంతవరకు రాలేదు. – భువనేశ్వరి, విద్యార్థి తల్లి, తిరుపతి

కుట్లు వేసేందుకు కూడా పనికిరాని బూట్లతో బడి వెళుతున్న పిల్లలు

నేటి నుంచి

హెల్మెట్‌ తప్పనిసరి

తిరుపతి క్రైమ్‌: తిరుపతి జిల్లా పరిధిలో సోమవారం నుంచి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌ లేని వారికి పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ కూడా పట్టరని చెప్పారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం చాలా వరకు ఉందని, అందులో భాగంగానే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ బంకుల్లో వాహనాలకు పెట్రోల్‌ పడితే బంకుపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 80,113 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,683 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నేటి పోలీస్‌ గ్రీవెన్స్‌ రద్దు

తిరుపతి క్రైమ్‌: నగరంలో వీఐపీలు రాక సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగనున్న పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ప్రశాంతంగా టెట్‌

తిరుపతి సిటీ: జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలతో పాటు చైన్నెలోని మరో మూడు సెంటర్లలో ఆదివారం జరిగిన టెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం తొలి సెషన్‌కు 1,325మంది హాజరు కావాల్సి ఉండగా 1,226 మంది హాజరైనట్టు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌కు 955మంది హాజరుకావల్సి ఉండగా 829 మంది హాజరైనట్లు తెలిపారు.

విద్యార్థుల

3,02,172

పంపిణీ చేసిన

బ్యాగులు

2,32,001

సరఫరాలోనే పాడైన బ్యాగులు, షూలు

12వేలు

బ్యాగుల దుస్థితిపై

అందిన ఫిర్యాదులు

73వేలు

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
1
1/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
2
2/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
3
3/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
4
4/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
5
5/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
6
6/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
7
7/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
8
8/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
9
9/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
10
10/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
11
11/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!
12
12/12

‘కంట్రోల్‌’ తప్పిన ప్రయాణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement