భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం | - | Sakshi
Sakshi News home page

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

Dec 15 2025 6:54 AM | Updated on Dec 15 2025 6:54 AM

భాషపై

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

సాక్షి స్పెల్‌ బీ సెమీస్‌కు విశేష స్పందన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల నుంచి హాజరైన 500మంది విద్యార్థులు పోటాపోటీగా నాలుగు కేటగిరీల్లో మూడో రౌండ్‌ పరీక్ష సృజనాత్మకతను వెలికి తీస్తున్న సాక్షికి ధన్యవాదాలు తెలిపిన తల్లిదండ్రులు

తిరుపతి సిటీ: భాషపై పట్టు సాఽధించి ప్రతిభకు పట్టం కట్టడమే లక్ష్యంగా సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థల్లో నిర్వహించిన స్పెల్‌బీ సెమీఫైనల్‌ పరీక్షకు విద్యార్థులు పోటెత్తారు. ఈ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్‌ వ్యాఫి, అసోసియేట్‌ స్పాన్సర్‌గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వ్యవహరించాయి. క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రతిభ చూపి సెమీస్‌కు చేరిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన సెమీస్‌కు సుమారు 500 మంది విద్యార్థులు హాజరై తమ సత్తా చాటారు. ఉదయం 10.15కి పరీక్ష ప్రారంభమైన మధ్యాహ్నం 12గంటలకు ముగిసింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాక్షి సిబ్బంది పకడ్బందీ ఏర్పాటుల చేశారు.

పిల్లలు రాణించేలా ప్రోత్సాహం

ఆంగ్లంలో పిల్లల రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా గ్రూప్‌ స్పెల్‌బీ పరీక్షలు నిర్వహిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు సహకరిస్తోంది. దీంతో పదాల ఉచ్ఛారణ, కొత్త పదాలను తెలుసుకోవడం, స్పెల్లింగుపై పట్టు సాధించి పోటీ పరీక్షలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంతోషంగా ఉంది

సాక్షి స్పెల్‌బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించి సెమీస్‌కు చేరడం సంతోషంగా ఉంది. స్పెల్‌ బీ పరీక్షలో నూతన పదాల స్పెల్లింగ్స్‌తో పాటు పదాల ఉచ్ఛారణ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. తోటి విద్యార్థులతో పోటీ పడి పరీక్షలు రాయడంతో మాలోని ప్రతిభ, సామర్థ్యం తెలుస్తోంది.

– గీతిక, జశ్విత, 5వ తరగతి, విశ్వం స్కూల్‌, తిరుపతి

ఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యం

సాక్షి స్పెల్‌బీ సెమీస్‌కు మా అమ్మాయి ఎంపికై ంది. ఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. సాక్షి స్పెల్‌ బీతో ఆంగ్ల భాషపై భయం అనేది పోయింది. స్పెల్‌ బీ కోసం సాక్షి అందించిన మెటీరియల్‌లో సరికొత్త పదాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రొత్సహిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. – రాఘవేంద్రనాయుడు, స్వప్న, విద్యార్థిని సాయి రుషిత తల్లిదండ్రులు,

నాగార్జున స్కూల్‌, వైఎస్సార్‌ కడప జిల్లా

ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నాం

స్పెల్‌బీ పరీక్షలకు హాజరై ఇప్పటే రెండు రౌండ్లలో ప్రతిభ చూపి సెమీఫైనల్‌కు చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నామనిపిస్తోంది. నూతన పదాలు, వాటి అర్థాలు, స్పెలింగ్‌లు తెలుసుకుంటున్నాం. దీంతో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్న మా అకడమిక్‌ విద్యకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది.

– ఆరాధ్య, ప్రణవీ, సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌, నెల్లూరు

పోటీ ప్రపంచంలో ఉపయోగం

విద్యార్థులు సాక్షి స్పెల్‌ బీ పరీక్షలకు హా జరుకావడంతో పోటీ ప్రపంచంలో దీటు గా నిలబడేందుకు ఉపయోగపడుతుంది. మా విద్యార్థి సెమీస్‌కు చేరడం అభినందనీయం.స్పెల్‌బీ మెటీరియల్‌ సైతం అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో విద్యార్థులు నూతన పదాలపై పట్టు సాధిస్తారు. ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ప్రొత్సహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – విద్యార్థి పునీత్‌తో

టీచర్‌ ప్రమీల, క్యాండర్‌ నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌, తిరుపతి

థ్రిల్లింగ్‌గా ఉంది

సాక్షి స్పెల్‌బీలో పాల్గొనడంతో ఇంగ్లిషు భాషలో మా సత్తా ఎంటో తెలుస్తోంది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఉత్తీర్ణులై సెమీస్‌కు చేరాం. పరీక్ష బాగా రాశాం. ఎన్నో కొత్త పదాలకు స్పెల్లింగ్‌ రాయడం థ్రిల్లింగా ఉంది. మా ఆలోచనకు పదును పెట్టి పదాలకు స్పెల్లింగ్స్‌ రాస్తున్నాం. దీంతో మేము చదివే ఇంగ్లిషు సబ్జెక్ట్‌ సులువుగా అనిపిస్తోంది. – తమన్‌ కృష్ణ,

హర్మన్‌ కృష్ణ, ఎడిఫై స్కూల్‌, తిరుపతి

పిల్లలలో ఆసక్తి పెరుగుతోంది

సాక్షి స్పెల్‌బీపై పిల్లల లో ఆసక్తి పెరుగుతోంది. మా అమ్మాయి ఒకటో తరగతి చదువుతోంది. స్పెల్‌ బీ పరీక్ష ను సునాయాసంగా రాయడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్‌ వరకు రావడం, పరీక్షలో ఉచ్చరిస్తున్న పదాలను అర్థం చేసుకుని స్పెల్లింగ్‌లు రాస్తుంటే ఎంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సాక్షికి రుణపడి ఉంటాం. – రమ్య,విద్యార్థిని

సాయిరుషిత తల్లి, క్యాంఫోర్డ్‌ స్కూల్‌, తిరుపతి

ఎంతో ఆసక్తిగా జరిగింది

సాక్షి స్పెల్‌ బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లు ఒక ఎత్తు. కానీ, ఆదివారం జరిగిన సెమీఫైనల్‌ ఎంతో ఆసక్తిగా జరి గింది. నూతన పదాలను నేర్చుకున్నాం. వాటికి స్పెల్లింగ్‌లు కొత్తగా ఉన్నాయి. బాగా రాశాం. ఫైనల్‌కు చేరుకుంటామనే నమ్మకం ఉంది. విద్యార్థులను సాక్షి మీడియా ఎంతగానో ప్రొత్సహిస్తోంది.

– హర్షిత, మోనిక, 7,8వ తరగతి

విద్యార్థులు, ప్రియాంక గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌, నెల్లూరు

పరీక్ష బాగా రాశాం

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌ పరీక్ష బాగా రాశాం. చాలా ఈజీగా అనిపించింది. స్పెల్‌బీ మెటీరియల్‌ పోటీ పరీక్షలతో పాటు మా అకడమిక్‌ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పరీక్షలు మరిన్ని సాక్షి మీడియా నిర్వహించాలి. మేము మరిన్ని పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. – హుమేమ, మహి,

4వ తరగతి విద్యార్థులు, విద్యోదయ

అపెక్స్‌ స్కూల్‌, నెల్లూరు

భయం పోయింది

గతంలో ఇంగ్లిషు భాష అంటే కాస్త జంకేవాళ్లం. సాక్షి స్పెల్‌బీ పోటీ పరీక్షలకు హజరుకావడంతో ఆ భయం పోయింది. ఆంగ్లభాష అంటే ఇంతేనా అని మాపై మాకు నమ్మకం కలిగింది. భాషపై పట్టుతో పాటు స్పెల్లింగ్‌, పదాల ఉచ్ఛారణ తెలుసుకున్నాం. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు.

– చరణి, సాత్విక్‌, 6వతరగతి విద్యార్థులు,

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, వైఎస్సార్‌ కడప జిల్లా

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం1
1/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం2
2/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం3
3/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం4
4/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం5
5/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం6
6/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం7
7/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం8
8/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం9
9/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం10
10/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం11
11/11

భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement