బస్ షెల్టర్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు
చిల్లకూరు:తిరుపతి జిల్లా పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి రూ.5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేసినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్‌ను తొలగించారని, దీంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి తొలగించిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. రోడ్డుపై నిల్చుని, గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి దుస్థితి నెలకొందని తెలిపారు. మూడు మండలాలకు వెళ్లే కూడలి కావడంతో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుందని సమస్య తీవ్రతను స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా తెలుసుకున్న వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళి బస్‌షెల్టర్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. దీంతో రూ. 5లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. బస్ షెల్టర్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఎంపీ గురుమూర్తి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బస్ షెల్టర్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు


