శ్రీసిటీలో సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పా
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025–2030పై ఉన్నతస్థాయి సమావేశం సోమవారం శ్రీసిటీలో నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణతోపాటు చెత్త నుంచి సంపద సృష్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించారు. డాక్టర్ పి.కృష్ణయ్య, ఇతర ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్, శ్రీసిటీ అమలు చేస్తున్న 3ఆర్ (రెడ్యూస్, రీయూస్, రీ సైకిల్) విధానాల ప్రాధాన్యత, నిబద్ధతను వివరించారు. ప్రత్యేకించి శ్రీసిటీ జీరో వ్యర్థ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, స్కోర్ పోర్టల్‌ను వినియోగించుకుని శ్రీసిటీ ప్రాంతంలో 3ఆర్ పద్ధతులను మరింత బలోపేతం చేయాలని పరిశ్రమల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
పారిశ్రామిక కేంద్రాలకు శ్రీసిటీ ఆదర్శం
ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఇతర పారిశ్రామిక కేంద్రాలకు శ్రీసిటీ ఆదర్శంగా నిలుస్తుందని డాక్టర్ కృష్ణయ్య తెలిపారు. శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, పారిశ్రామిక ఉప ఉత్పత్తులను రీసైకిల్, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం అత్యుత్తమ పద్ధతులుగా పేర్కొన్న ఆయన, వ్యర్థ నిర్వహణ ఏజెన్సీలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. కాగా తన సందేశంలో ఏపీపీసీబీ చైర్మన్‌కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీీపీసీబీ సభ్యుడు నాగేశ్వర రాజు, సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ముని ప్రసాద్ పాల్గొన్నారు.


