లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఆర్‌ఎస్కేల వద్ద గంటల తరబడి
నిరీక్షణ
నిల్చుకోలేక అవస్థ పడుతున్న అన్నదాతలు
వరుసలో టోకెన్లు పెట్టి ఎదురుచూపు
వేడుకగా అఖండ జ్యోతి
నాయుడుపేటలో సోమవారం అఖండ జ్యోతి పూజోత్సవం వేడుక నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రేపటి నుంచి టీచర్లకు అర్హత పరీక్షలు ప్రారంభం
క్రీడలు దినచర్యలో భాగం కావాలి
క్రీడలు దినచర్యలో భాగం కావాలని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ అన్నారు.
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రభుత్వం యూరియా ఇస్తామని ప్రకటించడంతో కావలివారిపల్లికి చెందిన ఓ రైతు కే వడ్డేపల్లె రైతు సేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నాడు. తీరా ఆయన టోన్ నంబర్ వచ్చే సరికి ఓ బస్తా మాత్రమే యూరియా ఇస్తామన్నారు.. ఇదేమిటంటే.. తీసుకుంటే తీస్కో లేకపోత పక్కకు జరుక్కోమని చెప్పారు. కే వడ్డేపల్లి ఆర్‌ఎస్కే వద్దనే కాదు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. ప్రభుత్వమేమో యూరియా కొరత లేదని చెబుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులేమో ఒక్కొక్క బస్తానే ఇస్తామని చెబుతున్నారు. ఫలితంగా పుడమి పుత్రులు యూరియా కోసం తిప్పలు పడక తప్పడం లేదు.
కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రం వద్ద
యూరియా కోసం గుమికూడిన రైతులు
క్యూలో నిల్చుకోలేక
అవస్థలు పడుతున్నాం
యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వచ్చా ను. టోకెన్ ఇచ్చారు క దా వరుస క్రమంలో పి లుస్తారని వేచి చూస్తుండగా అందరూ క్యూలో నిలబడాలని చెప్పారు. గంటలు గడుస్తున్నా నాకు ఇచ్చిన టోకెన్ నంబర్ పిలవలేదు. అక్కడ నిలబడలేక చేతిలో ఉన్న కాగితాలు వరుసలో పెట్టి పక్కన కూర్చున్నా. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.
– నరసింహారెడ్డి, రైతు, పెద్దమ్మగారిపల్లి
ఎంతైనా ఇస్తామని.. ఒక బస్తా ఇచ్చారు
యూరియా కొరత లేదు.. మీకు ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి గంటల తరబడి నిలబడితే ఒక బస్తా చేతికిచ్చి కొద్ది రోజుల తరువాత మరొక బస్తా ఇస్తామని చెప్పి పంపుతున్నారు. వరి పంటకు అవసరమైనన్ని బస్తాలు ఒకే సారి ఇస్తే రవాణా ఖర్చులు అయినా మిగులుతాయి కదా. – బి.రెడ్డి, రైతు, వడ్డేపల్లి
యూరియా కోసం ఇన్ని కష్టాలా?
సాధారణంగా పంటలకు అందించే యూరియా కో సం రైతులు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని కల లో కూడా అనుకోలేదు. వరి పంట సాగులో ప్రధానంగా యూరియా వాడాల్సి ఉందని తెలిసినా వ్య వసాయ శాఖ అధికారులు అవసరమైన మేరకు యూరియా తెప్పించలేక పోతున్నారు. అలాగని యూరియా కొరత ఉందని చెప్పలేక పోతున్నారు. రైతులకు గొడవ చేయకండని, నచ్చజెప్పి ఒక బస్తా చేతికిచ్చి పంపుతున్నారు.
– జ్యోతిరెడ్డి, రైతు, వడ్డేపల్లి
యూరియా కోసం యుద్ధమే చేయాలి
యూరియా బస్తా కోసం వస్తే యుద్దమే చేయాల్సి వస్తోంది. గంటల తరబ డి నిలబడినా టోకెన్ పిలవలేదు. అధికారులు ముందుగా టోకెన్లు ఇచ్చి నా రైతులకు కష్టాలు మాత్రం తప్పలేదు. క్యూలో నిల్చుకోలేక చెట్ల కింద సేదతీరుతున్నా. అదికూడా ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ కావాలంటే కుదరదని చెబుతున్నారు. – పద్మావతి, మహిళా రైతు, పోలిరెడ్డిపల్లి
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,343 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
పోలీస్ గ్రీవెన్స్‌కు 112 అర్జీలు
తిరుపతి క్రైం: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 112 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందు లో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
15 నుంచి
హెల్మెట్ తప్పనిసరి
తిరుపతి క్రైమ్: ద్విచక్ర వాహన చోదకులు ఈ నెల 15వ తేదీ నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు సోమవారం విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సుమా రు 45 శాతం మరణాలు ద్విచక్ర వాహనచోదకుల మితిమీరిన వేగం, హెల్మెట్ రహిత ప్రయాణంతో జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.హెల్మెట్ వాడకంతో 40 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉన్నట్లు జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు పట్టకూడదని నిబంధనలను అమలు చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యావంతులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, యువత, అందరూ ద్విచక్ర వాహనచోదకులతోపాటు వెనుక కూర్చొని ఉన్నవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
యూరియా..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. నిద్రాహారాలు మాని ఆర్‌ఎస్కేల వద్ద నిరీక్షిస్తున్నారు. పొద్దస్తమానం వేచి ఉంటే ఎప్పటికో ఓ బస్తా ఇచ్చి, లేదు పొమ్మంటున్నారు. అవసరం మేరకు దొర క్కపోవడంతో కర్షకులు నీకా? నాకా అని పోటీలు పడాల్సి వస్తోంది. ఇందుకు చంద్రగిరిలో సోమ వారం జరిగిన ఘటనే నిదర్శనం. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం ఉదయం 5 గంటలకే రైతులు యూరియా కోసం క్యూలో నిలుచున్నారు. వరుసలో నిల్చోలేక పట్టాదారు పాసుపుస్తకం, టోకెన్లను వరుసలో పెట్టి కూర్చున్నారు. తమ టోకెన్ నంబర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. టోకెన్ నంబర్ పిలిచిన తరువాత అడిగినంత యూరియా ఇవ్వకుండా ఒక బస్తా మాత్రమే ఇస్తామనడంతో చాలా మంది రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాలుగు పంచాయతీలకు ఒకే చోట
పాకాల మండలంలోని కె.వడ్డేపల్లి, కావలివారిపల్లి, అదెనపల్లి, గాదంకి పంచాయతీలకు చెందిన రైతులందరికీ కె.వడ్డేపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా బస్తాలను సరఫరా చేస్తామని ముందుగా ప్రకటించడంతో రైతులు అందరూ అక్కడకు చేరుకున్నారు. నాలుగు పంచాయతీలకు చెందిన రైతులు ఒకేసారి ఆర్‌ఎస్కేల వద్దకు రావడంతో గందరగోళం నెలకొంది.
డిగ్రీ పరీక్షలు వాయిదా
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో మంగళవారం నుంచి జరగాల్సిన డీగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ప రీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు సోమవా రం తెలిపారు.సాంకేతిక సమస్యలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరీక్షలనియంత్రణాధికారి తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు.
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు టెట్ తరహా అర్హత పరీక్షలను బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 సెంటర్లలోనూ, అలాగే తమిళనాడు రాష్ట్రం చైన్నెలో 3 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి 21వ తేదీ వరకు జరగనున్న అర్హత పరీక్షలు రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజర య్యే టీచర్లు పరీక్షా కేంద్రాలకు అర్ధగంట ముందే చేరుకోవాలని, నిమిషం అలస్యమైనా అనుమతించే ప్రసక్తి లేదన్నారు. అభ్యర్థులకు కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
పక్కదారి పట్టిస్తున్న
పచ్చపార్టీ నేతలు
పక్కదారికి మళ్లించిన పచ్చ నేతలు
యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో స్థానిక పచ్చపార్టీ నేతలు వచ్చిన యూరియా బస్తాలను పక్కదారికి మళ్లించడంతోనే పంపిణీలో ఆలస్యమైందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. టోకెన్లు ఇచ్చినా సరే గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆర్బీకే వద్ద యూరియా బస్తాల కోసం నీకా, నాకా అన్నట్టుగా రైతులు పోటీలు పడ్డారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అధికారులు కొంత సమయం పంపిణీని నిలిపివేయాల్సి వచ్చింది. ఇదే విషయంపై మండల వ్యవసాయ శాఖ అధికారి హరితను వివరణ కోరగా కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రానికి 300 యూరియా బస్తాలు దిగుమది కాగా 300 మంది రైతులకు టోకెన్లను జారీ చేశామని, అందరికీ ఒక్కొక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశామన్నారు. అయితే ఒకేసారి అందరు రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందన్నారు. అయితే రైతులు మాత్రం 300 బస్తాలకంటే అదనంగా యూరియా వచ్చిందని, పచ్చపార్టీ నేతలకు అవసరమైన బస్తాలను పక్కదారిలో పంపి, మిగిలిన యూరియా మాత్రమే రైతులకు పంచుతున్నారని ఆరోపించారు.
తలో మాట
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదంటోంది ప్రభుత్వం.. రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.. రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళితే ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెబుతారు.. ఎందుకలా..? యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు కదాని ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి సమాధానం రాదు.. ఒక్క బస్తా మాత్రమే ఇస్తాం.. ఇష్టం ఉంటే తీసుకో లేదంటే పక్కకు తప్పుకో అంటారు.. ఆ ఒక్క బస్తా యూరియా తీసుకోవడానికి రైతులు ఎన్నెన్నో అవస్థలు పడక తప్పడం లేదు.
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!


