అధికారుల పర్యవేక్షణేదీ?
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో 2.30 లక్షల ఎకరాల్లో 1.50లక్షల మంది రైతులు వరిపంటను సాగుచేయనున్నారు. ఈ క్రమంలో సీజన్‌కు ముందే వ్యవసాయశాఖ అధికారులు ఏ వరి రకం పంటను సాగుచేస్తే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఆ పంటకు మంచి డిమాండ్ ఉంటుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఉంటే బాగుండేది. అలాగే వ్యవసాయాధికారులు విత్తనాలు అమ్ముతున్న డీలర్ దుకాణాలను తనిఖీలు చేయడంతోపాటు వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే మంచిగా ఉండేది. ఏదిఏమైనప్పటికి రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – రవి, రైతు, వరదయ్యపాళెం


