మళ్లీ పెట్టుబడి పెట్టలేం
వరి పంట సీజన్‌లో నాట్లు వేస్తేనే గిట్టుబాటు అవుతుంది. దానికి తోడు నకిలీ విత్తనాలతో సాగు చేసిన వరిపంటను దున్నివేసి, మళ్లీ సాగు చేయడానికి పెట్టుబడి లేదు. ఓ వైపు విత్తనాలు కొనుగోలు చేయాలి.. మరోవైపు పొలాన్ని రెండు నుంచి మూడు సార్లు దుక్కిచేయాలి.. ఇంకోవైపు ఎరువులు వేయాలి. అంతేకాకుండా కూలీల అవసరం ఉంది. ఎకరం పంటను సాగు చేయడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాగు చేసినా సీజన్ ముగియడంతో దిగుబడి వస్తుందో లేదో అనే ఆందోళన నెలకొంది.
– విజయభాస్కర్‌రెడ్డి, రైతు, కోటపోలూరు


