మా స్వాధీన అనుభవంలో ఉన్న భూమి
50 ఏళ్లుగా మా కుటుంబ అనుభవంలో ఉంటున్న భూమిలో రోడ్డు పక్కన పది మందికి అప్పట్లో మా అత్త ఇంటి స్థలాలు ఇచ్చింది. వారు అందరూ ఇళ్లు కట్టుకుని కాపురాలు ఉంటున్నారు. మైమూన్ అనే మహిళకు మా అత్త రెండు సెంట్లు భూమిని ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఆ స్థలం నాది అని అనడం విడ్డూరంగా ఉంది. ఆ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు మా వద్ద ఉన్నాయి. ఆ స్థలం ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అనడం న్యాయం కాదు. ప్రభుత్వ భూమి అయితే మొత్తం పది ఇళ్లను తొలగించాలి కదా. టీడీపీ కార్యకర్త కూడా అదే సర్వే నంబర్‌లోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు. ఆ ఇంటి జోలికి ఎందుకు వెళ్లలేదు.
– నండ్ర వరమ్మ, గురవరాజుపల్లి హరిజనవాడ,
రేణిగుంట మండలం


