శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ
శ్రీకాళహస్తి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో 34వ వార్డు పరిధిలో ఆదివారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య విద్య ప్రజల హక్కు అని, పీపీపీ విధానంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని తమ మద్దతు తెలిపారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ భక్తుడు శివప్రసాద్ ఆదివారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయాధికారులకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు పాల్గొన్నారు.
పది పరీక్ష ఫీజు గడువు
పొడిగింపు
తిరుపతి సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి చెల్లించాల్సి ఫీజు గడువును అపరాధరుసుము లేకుండా ఈనెల 9వ తేదీ వరకు చెల్లించవచ్చనని ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 12వతేదీ వరకు, రూ. 200 అపరాధ రుసుముతో 15వ తేదీ వరకు, రూ. 500 అపరాధ రుసుముతో 18వ తేదీవరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను రెండు సార్లుగా పరిశీలించి జాగ్రత్తగా తప్పులు లేకుండా యూడీఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,007 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఏడు గంగమ్మల జాతర చాటింపు
శ్రీకాళహస్తి: పట్టణంలో బుధవారం ఏడుగంగమ్మల జాతరను పురస్కరించుకుని ఆదివారం బేరివారి మండపం వద్ద గంగమ్మకు సంబంధించి కొండమిట్టలో చాటింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెట్టురాయి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను రజకులు సంజాకుల గురవయ్య, బాలనుబ్రహ్మణ్యం చేశారు. అనంతరం ధూప, దీప నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ కమిటీ సభ్యులు వజ్రం కిషోర్, అంజూరు రాజా, నాగమల్లి దుర్గాప్రసాద్, వినయ్, మెకానిక్ రెడ్డి, సుబ్బు, పవన్ రాయల్, సతీష్రయల్, గ్యాస్ బాబు, చందు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ


