ఎస్వీయూ పీజీ స్పాట్‌కు సెట్ అర్హత సడలింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ తా రాస్థాయిలో పడిపోయింది. దీంతో వర్సిటీ అధికారు లు స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలికి మొర పెట్టుకున్నారు. గత నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్లకు ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ఇప్పటికీ వర్సిటీలో అన్ని వి భాగాల్లో కలిపి సుమారు 3 వేలకు పైగా సీట్లు ఉండగా అందులో ఏపీ పీజీసెట్–2025 కన్వీనర్ కోటా కింద 45 శాతం సీట్లు సైతం భర్తీ కాలేదు. దీంతో 2025–26 విద్యాసంవత్సరంలో ఎస్వీయూలో పీజీ అ డ్మిషన్లు ఊహించని స్థాయి దిగజారడంతో వర్సిటీ భవిత ప్ర శ్నార్థకంగా మారిందని,ఉన్నత విద్యామండలి చొరవ చూపాలని పలుసార్లు విద్యార్థి సంఘాలు విన్నవించా యి. దీంతో స్పాట్ అడ్మిషన్లకు అనుమతి దక్కింది.
సెట్ అర్హత సడలింపు
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఏపీ పీజీ సెట్–2025 అర్హత ప్రామాణికాన్ని ఉన్నత విద్యామండలి సడలించింది. సెట్‌లో అర్హత పొందిన, సెట్ పరీక్షకు హాజరుకాకపోయినా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరేందుకు అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వర్సిటీలో మిగిలిన సీట్ల భర్తీకి సుగమం అయ్యింది. దీంతో ఈ ఏడాది కనీసం 60 శాతం సీ ట్లు భర్తీ అయ్యేనా? అని అధ్యాపకులు, వర్సిటీ అధి కారులు ఎదురు చూస్తున్నారు.
విద్యార్థి సంఘాల విజయం
స్పాట్ అడ్మిషన్లలో పీజీ సెట్ అర్హతను సడలింపు ఇస్తే నే వర్సిటీలో కనీసం 60 నుంచి 70శాతం అడ్మిషన్లు జరుగుతాయని విద్యార్థి సంఘాలు పలుసార్లు వర్సిటీ అధికారులకు, ఉన్నత విద్యామండలి అధికారులకు వి న్నవించుకున్నాయి. కానీ అధికారులు నియంతృత్వధోరణితో వ్యవహరించడంతో అడ్మిషన్లు పడిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల విన్నపానికి అధికారులు దిగివచ్చి స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చారు.
నేటి నుంచి స్పాట్ అడ్మిషన్లు
ఎస్వీయూలో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పీజీ స్పాట్ అడ్మిషన్లకు తేదీలను ప్రకటించారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 8వ తేదీ ఎంకామ్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, 9వ తేదీన ఎంఎస్సీ, 10వ తేదీన ఎంఏ ఆర్ట్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఏపీ పీజీసెట్–2025లో అర్హత సాధించిన వారికి ఇస్తామని, రెండో ప్రాధాన్యతలో నాన్ సెట్ విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు వర్సీటీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0877–2248589 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


