సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు
ఎప్పుడు వెళ్లినా సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు. తిరుపతిలోని ఒకటో డివిజన్, అక్కారంపల్లి, కొత్తపల్లి శ్మశానం అభివృద్ధికి సచివాలయం ఉద్యోగులకు సమస్యను చెప్పడానికి ఓ వైపు, కార్పొరేషన్ అధికారులకు సమస్యను వివరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే సచివాలయ ఉద్యోగులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు.
–మల్లీశ్వరి, 1వ డివిజన్, తిరుపతి
రేషన్ కార్డు కోసం తిప్పలు
నేను తిరుపతి తారకరామ నగర్‌లో నివాసమున్నాను. రేషన్ కార్డు కోసం రెండు నెలలుగా సచివాలయం చు ట్టూ తిరుగుతున్నా పని కా లేదు. స్థానికుల సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో సిబ్బంది గతంలో తక్షణ స్పందించడంతో మా సమస్యలు రోజుల వ్యవధిలోనే పరిష్కారం అయ్యేవి. ప్రస్తుతం సచివాలయంలో సమస్యలకు పరిష్కారం దొరకడం కష్టతరంగా మారుతోంది.
– పి.కరుణ, తిరుపతి
రోడ్లు, వీధిలైట్ల కోసం
తిరుగుతూనే ఉన్నా..
మా ఇంటికి వెళ్లే రోడ్డులో వీఽ దిలైట్లు సక్రమంగా వెలగ డం లేదు. ఈ విషయం సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని పలుసార్లు వెళ్లాను. ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. ఆరా తీస్తే వారంతా సర్వేలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఏ సమస్య చెప్పాలన్నా సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం సచివాలయాలు బోసిపోయాయి. – సురేంద్రబాబు, జీవకోన, తిరుపతి
సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు
సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు


