ఉబ్బలమడుగుకు రావొద్దు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని భారీ వర్షాలకు ఉబ్బలమడుగులోని కాలువలు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయని, పర్యాటకులు రావద్దని తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ తెలిపారు. వారు బుధవారం ఉబ్బలమడుగుకు వెళ్లకుండా ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లను పెట్టించారు. వారు మాట్లాడుతూ తుపాన్ల కారణంగా భారీ వర్షం కురుస్తోందని, దీంతో ఉబ్బలమడుగులోని కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. కాలువలలో పర్యటకులు దిగితే ప్రమాదమని, ఎవరు వెళ్లకూడదన్నారు.


