● అక్రమ కేసులు ఎంతో కాలం నిలవవు ● అండగా ఉంటా.. ధైర్యంగా ఎదుర్కొందాం ● చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్‌ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్‌కు ధైర్యం చెప్పారు.
పాత కక్షలతో యువకుడి హత్య
వరదయ్యపాళెం: పాత కక్షలతో ఓ యు వకుడికి మద్యం తాగించి,ఆ మత్తు లో ఉన్న అతడిని దారుణంగా హత్య చేసిన ఘటన వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం మిట్ట దళితవాడలో చోటు చేసుకుంది. ఈ హత్య జరిగిన రెండో రోజు సమాచారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లక్ష్మీపురం మిట్ట దళితవాడకు చెందిన పోలూరు హరి (34) వృత్తి రీత్యా వంట మాస్టర్. అదే కాలనీకి చెందిన గౌతమ్ అనే వ్యక్తితో ఇటీవల మద్యం సేవిస్తుండగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అతడు తన సోదరుడు ప్రేమ్‌కుమార్‌తో కలసి తమిళనాడు నుంచి మరో ఇద్ద రు స్నేహితులను పిలుపించుకుని మద్యం సేవించడం కోసం పో లూరు హరిని గత ఆదివారం గౌతమ్ ఇంటికి రప్పించుకున్నారు. సరదాగా అందరూ కలసి ఇంట్లో మద్యం సేవించారు. ఇంతలో పాత గొడవల సమయంలో జరిగిన వివాదాలను లేవనెత్తిన గౌ తమ్, హరితో గొడవ పడేందుకు సిద్ధమయ్యాడు. అయితే తిరగబడిన హరిపై గౌతమ్, అతని సోదరుడు ప్రేమ్‌కుమార్, మరో ఇద్ద రు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. బండరాయి, కొ య్యితో హరి తలపై కొట్టి హత్య చేశారు. హరి మృత దేహాన్ని అదే కాలనీలో కాపురం చేయని పాత ఇంటి బాత్రూమ్‌లో పడేశారు. దీంతో ఆదివారం రాత్రి హత్య ఘటన జరిగినప్పటికీ మంగళవారం ఉదయం మేకల కాపరి మృత దేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన డీఎస్పీ రవికుమార్, సీఐ మురళి, ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ప్రధాన నిందితుడు గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సమాచారం. మరో నిందితుడు ప్రేమ్‌కుమార్ తమిళ నాడుకు చెందిన ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు.
నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది!


