గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు
వాకాడు: మండలంలోని వాలమేడులో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీ కేజీ కారణంగా మంటలు చెలరేగాయి. స్థాని కుల కథనం మేరకు.. వాలమేడు గిరిజన కా లనీకి చెందిన మానికల శీనయ్య ఇంట్లో గ్యా స్ లీక్ అవుతున్న విషయం గుర్తించకుండా గాస్ స్టౌవ్ వెలిగించడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లతోపాటు దుస్తులు, వస్తు సామగ్రి కాలిపోయా యి. కోట అగ్నిమాపకశాఖ అధికారులు ఘ టనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వాకాడు తహసీల్దార్ మహ్మద్ ఇగ్భా ల్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసి భరోసా ఇచ్చారు.
మృతదేహాలు అప్పగింత
చంద్రగిరి:దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఒకే ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి అయ్యింది. గుడియాత్తం పట్టణానికి చెందిన సత్యరాజ్, పూన్‌గొట్టై కు టుంబ సభ్యులకు తిరుచానూరు పోలీసులు స మాచారం అందించడంతో మంగళవారం వా రు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలకు పో స్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాలను వారి కు టుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. దామినేడు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి ప్రధానద్వారం లోపల గడియ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మృతదేహాల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, వైద్యాధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రకారం బాలుడితో పాటు సత్యరాజ్, పూన్‌గొట్టై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో మంగళవారం 8వ ఐఎల్‌సీసీ సదస్సు రెండో రోజు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అల్గారిథంలు, క్వాంటమ్ సమాచారంపై జాతీయ స్థాయి హ్యాండ్స్–ఆన్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జ్ఞాన ఉత్పత్తి, నైపుణ్యం, వ్యాప్తిపై దృష్టి సారించి క్వాంటమ్ వాలీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకు రావడం ఆనందదాయకమని ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో పూణేకు చెందిన క్వాంటమ్ శాస్త్రవేత్త అమిత్ సక్సేనా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద తదితరులు ప్రసంగించారు.


