క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 62 మందికి ఉద్యోగాలు
తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్, ఎంసీఏ విద్యార్థినులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారు నిర్వహించిన ఇన్‌ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందులో 62 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని ప్లేస్‌మెంట్ అధికారి ఆచార్య బి.కిషోరి తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను వర్శిటీ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.రజిని, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ పి. మల్లికార్జునలు అభినందించారు.


