● నలుగురికి స్వల్ప గాయాలు
పాకాల: వేగంగా వస్తూ డివైడర్‌ని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయా లైన సంఘటన సోమవారం మండలంలోని కోనప్పరెడ్డిపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జా తీయ రహదారిపై తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతూ కోనప్పరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పిన కా రు డివైడర్‌ని ఢీకొంది. దీంతో కారులోని కర్ణాటకవాసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమా దం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరీష్‌గౌడ్ తెలిపారు.
క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణ
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ క ళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఐదు రోజు ల శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 40 మంది అధ్యాపకులు శిక్షణలో పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రా ముఖ్యత, ప్రాథమిక సిద్ధాంతాలు, ఆ ధునిక పరిశోధనా ధోరణులు, అనువర్తనాలపై నిపుణులు అధ్యాపకులకు శిక్షణ అందించనున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫిజిక్స్ వి భాగం అసోసియేట్ ప్రొఫెసర్లు రితీష్ కుమార్ అగర్వాల్(ఐఐటీ తిరు పతి) చిత్రాసేన్ జైనా(ఐఐఎస్‌ఈఆర్) మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా విస్తరిస్తున్న క్వాంటమ్ టెక్నాలజీలపై అధ్యాపకులు అవగాహ న పెంచుకోవాలన్నారు. సిలబస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభ్యాసాలను ప్రవేశపెట్టి, విద్యార్థులను నిష్టాతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్‌ఓడీలు మల్లిక, మురళి, కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమబాల, ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో తిరుపతి 19వ స్థానం
తిరుపతి అర్బన్: తొలి రోజు 2,62,108 పింఛన్లకు 2,43,184 పంపిణీ చేశారు. 92.78 శాతం మాత్రమే పంపిణీ చేయడంతో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.
డివైడర్‌ని ఢీకొన్న కారు


