పొలం వివాదంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: పొలం వివాదంలో ఓ దళిత కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన డక్కిలి మండలం చెన్నసముద్రం (తురకపల్లి)లో సోమ వారం చోటు చేసుకుంది. బాధితులు డక్కిలి వరలక్ష్మి కుటుంబ సభ్యల కథనం మేరకు.. వరలక్ష్మి కుటుంబానికి చెందిన వారసత్వ భూమిని ఆమెకు, ఆమె కుమారులకు తెలియకుండా ఆమె భర్త తిరుపాల్‌ను మిట్టపాళెం గ్రామానికి చెందిన ఎం శేఖర్ నాయుడు అనే వ్యక్తి తీసుకెళ్లి రిజిష్టేషన్ చేయించుకున్నాడు. ఆ విషయం తెలియడంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఈ విషయా న్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో జరిగిన వివాదంపై డక్కిలి పోలీస్ స్టేషన్‌లో శేఖర్ నాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కాగా పొలంలో శేఖర్ నాయుడు వారికి తెలియకుండా వరినాట్లు వేశాడు. దీంతో బాధితులు తమ పొలంలో వరి నాట్లు వేశారని తెలిసి వరలక్ష్మి భర్త తిరుపాల్, కుమారుడు చక్రి పొలం దగ్గరకి వెళ్లి వీడియోలు తీస్తుండగా గమనించిన ఎం శేఖర్ నాయుడు, వేముల రమేష్, రంగినేని శివరాజా, పోలేరయ్య చక్రిపై దాడి చేశారు. ఈ విషయమై డక్కిలి ఎస్‌ఐ శివ శంకర్‌ను వివరణ కోరగా ఈవివాదంపై గతంలో శేఖర్ నాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణలో ఉందని చెపఆపరు. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
పొలం వివాదంలో దళిత కుటుంబంపై దాడి


