హత్య కేసులో నిందితుడి అరెస్టు
తడ: హత్యకేసులో నిందితుడిని పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. సోమవారం తడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నా యుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఈ వివరాలను వెల్లడించారు. తడ మండలం, చేనిగుంట గిరిజనకాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న టైర్ల పంచర్ కొట్టులో బిహార్ రాష్ట్రానికి చెందిన సహ్మద్ అలీ పని చేస్తున్నాడు. నవంబర్ 26వ తేదీ సాయంత్రం చేనిగుంట గ్రామానికి చెందిన మీంజూరు ప్రతాప్ అనే వ్యక్తి వచ్చి సైకిల్‌కి గాలి పట్టమని అలీని డిమాండ్ చే శాడు. ఇది కార్లు, లారీల టైర్లకు పట్టే మిషన్ అయినందున సైకిల్‌కి గాలి పట్టడం కుదరదని నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రతాప్ అందుబాటు లో ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని ఆలీ తలపై కొట్టడంతోపాటు సిమెంటు రాయితో తలపై బలంగా కొట్టా డు. అదే సమయంలో అక్కడ ఉన్న స్థలం యజమాని కోగిలి రామయ్య అడ్డుకునేందుకు ప్రయ త్నించగా అతన్ని కూడా సిమెంటు రాయితో కొట్టి పరారయ్యా డు. ఫిర్యాదు అందుకున్న సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, తడ ఎస్‌ఐ కొండపనాయుడు నిందితుడు ప్రతాప్‌ని అరెస్టు చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ చెంచుబాబు అభినందించారు.


