ఘరానా మోసగాడు అరెస్టు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్ని నెలలుగా సీఐనని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన ఘరానా మో సగాడిని భాకరాపేట ఎస్‌ఐ రాఘవేంద్ర సోమ వా రం అరెస్టు చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు.. శివకుమార్ అనే వ్యక్తి తాను పోలీస్ అధికారి అని చెప్పకుంటూ, కేసులు పెడతానని భయపెట్టి పలువురి వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేంద్ర గుర్తించారు. ఈ మేరకు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివకుమార్ నకిలీ ఐడీలు, నకిలీ పోలీస్ లోగో ఉన్న బ్యాడ్జీలు, వాకీటాకీలు ఉపయోగించి అసలు పోలీస్‌లా నటించేవా డు. మరింత నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్రైవే ట్ వాహనాలపై ‘‘పోలీస్’’ స్టిక్కర్లు అతికించి తిరుగుతూ పలువురి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దోచు కున్నాడు. ఈ క్రమంలో శివకుమార్, అతని స్నేహితుడు రమణ ఇద్దరు భాకరా పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము పోలీసులమని, తన బంధువులు అ మ్మాయి మోసపోయిందని, ఆమెను కాపాడాలని పోలీస్‌స్టేషన్‌లోనే పంచాయితీ పెట్టి పోలీసులు సైతం బెదిరించాడు. అనుమానించిన భాకరాపేట ఎస్‌ఐ రాఘవేంద్ర నకిలీ సీఐని అరెస్టు చేశారు.


