తిరుమల: ముంబైకి చెందిన జీన్.బొమ్మాన్జీ దుబాష్ చారిటీ ట్రస్టు టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.50 లక్ష లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ ట్రస్టు సీఎఫ్‌ఓ చంద్రశేఖర్ కృష్ణమూర్తి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆల య అధికారులకు విరాళం డీడీని అందజేశారు.
ఘనంగా సత్యసాయి జయంతి
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో సత్యసాయి శత జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి ము ఖ్యఅతిథి హాజరయ్యారు.కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం చేపట్టారు. సత్య సాయిబాబా జీవితం, సామాజిక శ్రేయస్సుపై ఆయన ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. డీన్ ప్రొఫెసర్ శుక్లా, అధ్యాపకులు వెంకట్రావు, ఆర్.లక్ష్మీనారాయణ, బాలిచక్రవర్తి, నారాయణ, బాలదత్తాత్రేయ, శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీకి రూ.50 లక్షల విరాళం


