గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో అందించిన పథకాలకూ మంగళం
నేతన్న నేస్తం పథకం అటకెక్కినట్లే ?
ముడి సరుకు ధరలు ౖపైపెకి..
గిట్టుబాటు ధర అందక కార్మికులు విలవిల
పూట గడవడమే గగనమంటున్న చేనేతలు
రామచంద్రాపురంలో గ్రామకంఠం భూమిని కొందరు అధికార పార్టీ నేతలు ఆక్రమించి ఇళ్లు కడుతున్నా అడిగేవారు లేరు.
నేడు 8వ ఐఎల్‌సీసీ సమావేశం
తిరుపతి ఐఐటీలో మూడు రోజుల పాటు 8వ ఐఎల్‌సీసీ)–2025 సమావేశం నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తెలిపారు.
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మగ్గం నేస్తున్న చేనేత కార్మికురాలు, (ఇన్‌సెట్) పట్టు ముడి సరుకు ఇదే
పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేతన్నల కళ్లలో నీటి సుడులు తిరుగుతున్నాయి. పని లేక పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ సహకారంతో పాటు చేతినిండా పని ఉండడంతో వారు దర్జాగా బతికేవారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ రంగం కళావిహీనం అవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేత రంగానికి సంక్షేమ పథకాలతో పాటు అన్నివిధాలా చేయూతనందిస్తే..టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగా అమలు చేస్తూ.. నేతన్న నేస్తం నిలిపేసి మోసం చేస్తోంది.
వెంకటగిరి(సైదాపురం): నేతన్న దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఆర్భాటపు హామీలు అమలుకు నోచుకోకపోవడంతో నేతన్నలకు భంగపాటు తప్పడం లేదు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభత్వం అమలు చేయకపోవడం పట్ల చేనేత కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడి.. మరోవైపు ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో నేసిన చీరల ధర పెరిగాయి. వాటిని కొనేవారు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారు. గతంలో కిలో పట్టు రూ.3 వేలు ఉండగా.. రానురాను ప్రస్తుతం రూ.8వేలకు చేరింది. జరి కట్ట రూ.325 ఉండగా ఈ ఏడాది రూ.500 నుంచి రూ.600కు పెరిగింది. రంగులు గతంలో రూ.150 నుంచి రూ.170 ఉండగా ప్రస్తుతం వీటి ధరలు రూ. 300 నుంచి రూ.500కి చేరాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 42 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో వేల మంది చేనేత కార్మికులుగా నమోదయ్యారు. మాస్టర్స్ వీవర్, వద్ద పనిచేస్తున్న వారు, మాస్టర్స్ వీవర్స్ ద్వారా మరి కొంతమంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 15,475 మగ్గాలు ఉన్నాయి. వీటిలో సహకార రంగంలో 4,250 మగ్గాలు నడుస్తున్నాయి. గత మూడు నెలలుగా చాలా మగ్గాలు మూతబడుతూ వస్తున్నాయి.
అమలుకు నోచుకోని ముఖ్యమంత్రి హామీ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున ఏటా సాయం అందించింది. 2023 జూలైలో తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నుంచి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేతలకు నిధులు విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా నేతన్న నేస్తం ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో అతి త్వరలో నేతన్ననేస్తం కింద రూ.25 వేలు చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్స్, పవర్ లూమ్‌లకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన రోజు నుంచే అమల్లోకి వస్తుందన్నారు. జిల్లాలో వంద యూనిట్ల వరకు ఈ పథకం అమలు అవుతున్నప్పటీకీ మిగిలిన జిల్లాల్లో అమలు కావడం లేదు. ఇక విద్యుత్ చార్జీలను మాత్రం విపరీతంగా పెంచారు. 2017 నుంచి సహకార సంఘాలకు, చేనేత కార్మికుల పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.177 కోట్లు బకాయిలను పెండింగులో ఉంచింది. 2018 నుంచి ఆప్కో పాలకవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
చేనేతకు
‘చంద్ర’గ్రహణం
అల్లు పడుతున్న చేనేత కార్మికులు
అచ్చు అతుకుతున్న మహిళ
చేనేత దినోత్సవం సందర్భంగా
సీఎం చంద్రబాబు ఆర్భాటపు హామీలు
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!


