ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు

Dec 1 2025 7:40 AM | Updated on Dec 1 2025 7:40 AM

ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు

ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు

● 14 నుంచి 58వ ఇంటర్‌ ఐఐటీ స్పోర్ట్స్‌ మీట్‌ ● తిరుపతి, మద్రాస్‌, హైదరాబాద్‌ ఐఐటీల్లో జరగనున్న పోటీలు ● దేశంలోని 23 ఐఐటీల నుంచి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు

ఏర్పేడు: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐటీ) 58వ ఇంటర్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఈనెల 14వ తేదీ నుంచి 9 రోజులపాటు తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్నాయి. సాంకేతిక పరిశోధనల దిశగా పుస్తకాలతో కుస్తీ పడుతూ మేథోమదనం చేస్తున్న విద్యార్థులకు ఈ క్రీడోత్సవాలు కాస్త ఆటవిడుపు కానున్నాయి. తిరుపతి ఐఐటీతో పాటు మద్రాస్‌, హైదరాబాద్‌ ఐఐటీలు వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ రెజ్లర్‌ సతీష్‌ శివలింగం హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 వేలమందికి పైగా విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement