గూడు చెదిరె..గుండె పగిలె
రోడ్డున పడిన కుటుంబాలు విలపిస్తున్న బాధితులు రాజకీయ లబ్ధికే ఇళ్లను నేలమట్టం చేస్తున్న నేతలు కీలుబొమ్మలుగా రెవెన్యూ అధికారులు
రేణిగుంట : మండలంలోని పేద ప్రజలపై టీడీపీ నాయకులు కక్ష పెంచుకొని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకోవడమే నేరంగా పరిగణించి రెవెన్యూ అధికారులను కీలుబొమ్మలుగా చేసి తమ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రేణిగుంట మండలంలో సుమారుగా 500 ఇళ్లు కూల్చి వేశారు.
పోలీసు బందోబస్తు నడుమ..
మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలోని కొత్తపాలెం రెవెన్యూ పరిధిలో బుధవారం మొదలుపెట్టిన పేదల ఇల్లు కూల్చివేత శుక్రవారం కూడా కొనసాగింది. శుక్రవారం సుమారు 30 ఇళ్లను రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకొని నేలమట్టం చేశారు. ఐదు మిద్దె ఇల్లులుకు మాత్రం రెండు రోజులు గడువిచ్చారు. తెల్లవారుజామున 6 గంటలకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్ల వద్దకు చేరుకొని ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించారు.
రోడ్డున పడిన కుటుంబాలు
మూడు నాలుగు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఉన్నపలంగా రెవెన్యూ అధికారులు నేలమట్టం చేయడంతో అనేక కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని రోడ్డుపై పెట్టుకొని దిక్కు తోచని పరిస్థితుల్లో బాధితులు బోరున విలపించారు. ఇంటి సామాన్లు బయటకు వేయడంతో రెండో తరగతి చదువుతున్న చిన్న పాప ఏమి చేయాలో తెలియకుండా ఆ సామాన్ల వద్ద కూర్చొని ఆవేదన చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.
ఇల్లులు కూల్చివేయడంతో శిథిలాలపై దిగులుగా కూర్చొని ఉన్న బాధితులు
పేదల ఇళ్లు కూల్చివేత
రోడ్డున పడేశారు..
ఉన్నఫలంగా నివాసం ఉంటున్న ఇళ్లను నేలమట్టం చేశారు. పిల్లలతో ఇంట్లో ఉన్న సామాన్లతో నడిరోడ్డు మీదకు వచ్చాం. మా పరిస్థితి అధికారులు వినడం లేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. – అమరావతి,
బాధితురాలు కొత్తపాలెం, రేణిగుంట
గూడు చెదిరె..గుండె పగిలె
గూడు చెదిరె..గుండె పగిలె
గూడు చెదిరె..గుండె పగిలె
గూడు చెదిరె..గుండె పగిలె
గూడు చెదిరె..గుండె పగిలె


