ప్రభుత్వానికి తగదు
పేదలు కట్టుకున్న ఇళ్లపై కక్షగట్టి కూల్చివేయటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదు. ఇక్కడ అధికారులు ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. స్థానిక నాయకుల మాటలే వేదంగా అధికారులు పనిచేస్తున్నారు. పేదల గోడు వారికి వినపడటం లేదు. – ముని లక్ష్మమ్మ బాధితురాలు
కొత్తపాలెం, రేణిగుంట
గత ప్రభుత్వంలో
కట్టుకోవడమే నేరమా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకోవటమే మేము చేసిన నేరమా. అప్పటి నుంచి ఇంటి పన్ను కడుతున్నాం. కరెంటు మీటర్లు ఉన్నాయి. నివాసం ఉంటున్నాం. అయినా ప్రభుత్వ భూమి అని మా ఇల్లు కూల్చివేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పేదలను బలి చేస్తున్నారు. మా ఇల్లు కూల్చడంతో 3 లక్షల వరకు నష్టపోయాం.
– గుర్రమ్మ,
బాధితురాలు కొత్తపాలెం, రేణిగుంట
ప్రభుత్వానికి తగదు


